Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858
సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
నాయకత్వం
బజాజ్ అలియంజ్ వద్ద, మార్పు పై స్థాయి నుండి ప్రారంభమవుతుంది. డిజిటల్ కార్యక్రమాల నుండి ప్రోడక్ట్ అభివృద్ధి వరకు, మా నాయకత్వ బృందం 100 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల సామూహిక అనుభవాన్ని కలిగి ఉంది. వ్యవస్థాపక స్ఫూర్తి మరియు కస్టమర్ విజయం పట్ల అభిరుచితో కలిపి నేడు మార్కెట్లో అత్యంత లాభదాయకమైన ఇన్సూరర్లలో ఒకటిగా కంపెనీ యొక్క నిరంతర విజయానికి వారు ఉత్ప్రేరకాలుగా ఉన్నారు. సంస్థకు వెన్నంటే ఉంటూ, వారు మనల్ని వృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
2001 లో బజాజ్ అలియంజ్ ప్రారంభమైనప్పటి నుండి శ్రీ తపన్ సింఘేల్ ఉన్నారు మరియు రిటైల్ మార్కెట్‌లో ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని ప్రారంభించే బృందంలో కీలకంగా వ్యవహరించారు.
తపన్ సింఘేల్ 2012 లో ఎండి మరియు సిఇఒ గా బాధ్యతలు చేపట్టారు. గత 12 సంవత్సరాలలో కంపెనీ అతని నాయకత్వంలో కొత్త ఆలోచనలను చేసింది, ఇండస్ట్రీ-ఫస్ట్ కార్యక్రమాలను ప్రారంభించింది మరియు కస్టమర్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించడం పై దృష్టి పెట్టింది. ఇన్సూరెన్స్ విక్రయం, పంపిణీ మరియు కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ఈయన మార్గదర్శకత్వంలో డిజిటల్ విధానంలోకి మారాయి.
దీనికి ముందు, అతను బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌కి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సిఎంఒ) గా పనిచేసారు. అతను కంపెనీలో ప్రాంతీయ మేనేజర్, జోనల్ హెడ్ మరియు సిఎంఒ గా అన్ని రిటైల్ ఛానల్స్ హెడ్ వంటి వివిధ పాత్రలను నిర్వహించారు.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క ఎండి మరియు సిఇఓ గా, ఈయన పరిశ్రమలో అభివృద్ధి, లాభదాయకత మరియు కాస్ట్ లీడర్‌షిప్ ని నిర్ధారించారు. ప్రస్తుతం, అతను జిఐ-కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్నారు, మరియు అతను ఇన్సూరెన్స్ మరియు పెన్షన్లపై సిఐఐ జాతీయ కమిటీకి కూడా అధ్యక్షత వహిస్తున్నారు. అతను 25వ ఆసియా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2021 వద్ద 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్' గెలుచుకున్నారు. IDC ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజ్ అవార్డ్స్ 2021 వద్ద అతను భారతదేశం మరియు ఆసియా-పసిఫిక్ ప్రాంతం కోసం 'సిఇఒ ఆఫ్ ది ఇయర్' ను గెలుచుకున్నారు. అతను Quantic బిఎఫ్ఎస్ఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 వద్ద, ఇండియా ఇన్సూరెన్స్ సమ్మిట్ & అవార్డ్స్ 2019, 22వ ఆసియా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2018 మరియు ఇండియన్ ఇన్సూరెన్స్ సమ్మిట్ 2017 'పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' గా గౌరవం అందుకున్నారు. ఈయన 2019 మరియు 2018 లో 'LinkedIn టాప్ వాయిస్ ఇన్ ఇండియా' గా నిలిచారు మరియు ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2018 వద్ద ఆసియా లో 'మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్' గా గుర్తింపు పొందారు.
Anckur Anil Kanwar is the Chief Financial Officer of Bajaj Allianz General Insurance. In his role, he oversees financial matters at the Company and Business Vertical levels. Additionally, his responsibilities include providing strategic inputs to achieve optimal outcomes for the Company.
With over 20 years of experience in the insurance sector across finance, reinsurance and underwriting domains, Anckur brings deep expertise to the Company. Prior to this, he served as the Deputy CFO at ICICI Lombard and has held key leadership roles as part of his extensive experience. Anckur is a Chartered Accountant from the Institute of Chartered Accountants of India.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద ఆపరేషన్స్ మరియు కస్టమర్ సర్వీస్ కోసం కె.వి.దీపు సీనియర్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రిటైల్ ఫైనాన్స్ కార్యకలాపాలలో అతనికి గొప్ప నిర్వహణ అనుభవం ఉంది. అతని ప్రత్యేకతల్లో సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్ మరియు ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ ఉన్నాయి.
ఈయన GE Capital లో సేల్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, సిక్స్ సిగ్మా మరియు ఆపరేషన్స్‌లో 19 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ఈయన ఒక సర్టిఫైడ్ లీన్ సిక్స్ సిగ్మా బ్లాక్ బెల్ట్, వివిధ పరిశ్రమ సమావేశాలు మరియు బిజినెస్ స్కూల్స్‌లో ఉపన్యాసకుడు. ఈయన వ్యాపార నిపుణుల ఎంపిక పరిశోధన సంఘం అయిన Harvard Business Review Advisory Council లో సభ్యుడు.
అల్పనా సింగ్ వివిధ నాయకత్వ సామర్థ్యాలను కలిగి, జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో 30 ఏళ్ల అనుభవంతో ఆరితేరిన గొప్ప అనుభవజ్ఞురాలు. ఆమె 2004 నుండి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఉన్నారు, అప్పటి నుండి వివిధ బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం, వీరు బ్యాంక్‌అష్యూరెన్స్, వ్యవసాయం మరియు ప్రభుత్వ వ్యాపారం విభాగాలకు హెడ్‌గా ఉన్నారు ; అల్పనా కంపెనీ సేల్స్ ట్రైనింగ్ కోసం కూడా నాయకత్వం వహిస్తారు. ఆమె పట్టుదల, ఏకాగ్రత మరియు కృషి కారణంగా బ్యాంకస్యూరెన్స్ ఛానెల్ అనేది కంపెనీకి ఒక చిన్నపాటి కంట్రిబ్యూటర్ నుండి ప్రధాన ప్లేయర్‌గా మారింది, అయితే, కేవలం కంపెనీలో మాత్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమలో ఈ మార్పు చోటుచేసుకుంది. తనది ఒక స్టార్ట్-అప్ మైండ్‌సెట్, సవాళ్లను ఇష్టపూర్వకంగా స్వీకరిస్తుంది. అంతర్గత మరియు బాహ్య కస్టమర్లు ఇద్దరు కూడా ఆమె సానుభూతి స్వభావం మరియు వ్యక్తిగత నైపుణ్యాలకు హామీ ఇస్తున్నారు.
అల్పనా మేఘాలయ రాష్ట్రం, షిల్లాంగ్‌లో సెయింట్ మేరీస్ కాలేజీ నుండి ఆంగ్లంలో ఆనర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు. ఐఐఎం ఇండోర్ నుండి క్రియేటివ్ ఇన్నోవేషన్‌లో డిగ్రీని అందుకున్నారు.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద విక్రమ్‌జీత్ హెచ్ఆర్, ఐఎల్ఎం మరియు అడ్మినిస్ట్రేషన్ ఛీఫ్‌గా ఉన్నారు. బజాజ్ అలియంజ్ జిఐసి కి ముందు విక్రమ్‌జీత్ L&T, Vodafone, మరియు Deutsche Bank వంటి ప్రముఖ సంస్థలతో విశేషమైన మరియు గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఒక యువ మరియు శక్తివంతమైన నాయకుడు, విక్రమ్‌జీత్ ఎల్లప్పుడూ వినూత్నమైన మరియు మార్గనిర్దేశం చేసే హెచ్‌ఆర్ కార్యక్రమాలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నారు. మంచి పనితీరు నిర్వహణ ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడం మరియు సంస్కృతిలో మార్పును తీసుకురావడం ద్వారా అతను ప్రజల ఎజెండాకు విపరీతమైన సహకారం అందించారు.
In this current role, Aashish heads Agency, Health Distribution, and Travel for the organization. Aashish carries a significant experience of more than 30 years, with close to 25 years in the insurance sector, in senior leadership positions in Life (Tata AIA Life Insurance), Health (Apollo Munich Health Insurance), and General (Bajaj Allianz General Insurance). This gives him the unique distinction of having worked in all three businesses of the insurance industry.
He has managed a spectrum of verticals, including Bancassurance, Pensions, Retail and Institutional Strategy & Distribution Management, Alliances, Corporate Business, and Digital & Rural businesses.
Aashish holds a graduate degree in hospitality management, followed by a 2-year course with the ITC Management Institute (Gurugram) and Certificate Courses on Strategy & Execution from IIM Ahmedabad and Innovation from Harvard Business School.
శ్రీ మజుందార్ 2001 నుండి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో భాగంగా ఉన్నారు. వివిధ ఇన్సూరెన్స్ ప్రొఫైల్‌లకు సేవలు అందించే అనేక విభాగాల్లో పనిచేయడం ద్వారా అతను కంపెనీకి ఎనలేని సహకారం అందించారు. అతను కోల్‌కతాలో కంపెనీ ప్రారంభించిన సంవత్సరంలో టెక్నికల్ విభాగంలో చేరారు మరియు క్లెయిమ్‌లు, పూచీకత్తును నిర్వహించడం చేసారు, చివరగా విక్రయాల నిర్వహణతో కొనసాగారు. అతను కోల్‌కతా మరియు బెంగుళూరుకు రీజినల్ హెడ్ అయ్యాడు, ఆ తర్వాత సౌత్ డివిజన్ జోనల్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం, అతను నేషనల్ హెడ్, మోటార్ డిస్ట్రిబ్యూషన్. ఇన్సూరెన్స్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉన్న మిస్టర్ మజుందార్ అధిక ప్రభావం చూపే నాయకుడు మరియు అతని ప్రధాన దృష్టి ఎల్లప్పుడూ లాభదాయకతపైనే ఉంటుంది.
అతను ఆంగ్ల భాషలో బీకామ్ మరియు బిఎ ఆనర్స్ పూర్తి చేసాడు. అతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ నుండి ఫెలోషిప్ కలిగి ఉన్నాడు మరియు సిఐఐ (యు.కె) యొక్క అసోసియేట్ మెంబర్‌గా ఉన్నారు. శ్రీ మజుందార్ ఒపెక్స్‌లో బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ పొందారు.
గ్రోత్ మార్కెటింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, B2B భాగస్వామ్యాలు, సేల్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ మరియు చెల్లింపులు, లెండింగ్, ఇ-కామర్స్ పరిశ్రమలలో కెరీర్ విస్తరించి ఉన్న రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసులలో ప్రోగ్రామ్ మరియు ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్‌లో అవినాష్ రెండు దశాబ్దాలకు పైగా గొప్ప అనుభవం కలిగి ఉన్నారు. గతంలో బజాజ్ ఫైనాన్స్‌లో పని చేశారు మరియు ప్రస్తుత, కొత్త కస్టమర్లను పొందడానికి, ఇంకా ప్రోడక్టులను క్రాస్-సెల్ చేసేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫారంను రూపొందించడానికి బాధ్యత వహించారు. అతని కెరీర్ మొత్తంలో, అతను కొత్త ప్రోడక్ట్ లాంచ్‌లు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇ-కామర్స్ భాగస్వామ్యాలు మరియు పనితీరు మార్కెటింగ్‌లో అనేక పాత్రలను పోషించారు. అవినాష్ NMIMS నుండి ఎంబిఎ గ్రాడ్యుయేట్ మరియు ముంబై విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసారు.
సతీష్ కేడియా బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లోని కార్పొరేట్ బిజినెస్ గ్రూప్ మరియు లయబిలిటీ కి నేతృత్వం వహిస్తున్నారు. ఈయన 2005 నుండి కంపెనీతో ఉన్నారు మరియు అతని అవధి సమయంలో వివిధ పాత్రలను పోషించారు. తన ప్రస్తుత హోదాలో, కమర్షియల్ మరియు లయబిలిటీ వ్యాపారానికి నేతృత్వం వహించడానికి, B2B పంపిణీ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి మరియు బలోపేతం చేయడానికి మరియు ఒక స్థిరమైన, స్కేలబుల్ మరియు ఆకర్షణీయమైన వ్యాపార నమూనాను అందించేందుకు వినూత్న అమ్మకాల వ్యూహాల రూపకల్పన కోసం ఈయన బాధ్యత వహిస్తారు.
కార్పొరేట్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌లో సతీష్‌కు రెండు దశాబ్దాలకు పైగా గొప్ప అనుభవం మరియు నైపుణ్యం ఉన్నాయి. బృంద వాతావరణాన్ని పెంపొందించడం మరియు సఫలత సాధించడం వీరి యొక్క బలం. ఈయన ఒక చార్టర్డ్ ఇన్సూరర్ (ACII, యుకె) మరియు ఫెలో ఆఫ్ ది ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FIII). అతను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి సస్టెయినబుల్ బిజినెస్ స్ట్రాటెజీ మరియు డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటెజీలో సర్టిఫైడ్ కోర్సులను కూడా కలిగి ఉన్నారు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి