Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్లు

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మీకు విస్తృత శ్రేణిలో ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కింపు సాధనాలను అందిస్తుంది. మీ అవసరాలు, బడ్జెట్ మరియు వయస్సు ప్రకారం మీరు ఇష్టపడే ఇన్సూరెన్స్ పై ప్రీమియంను అవాంతరాలు లేని మరియు వేగవంతమైన పద్ధతిలో లెక్కించవచ్చు.

మీరు మీ వంటగదిలోకి వెళ్లి చూసినట్లయితే, కత్తి నుండి గ్యాస్ స్టవ్ వరకు ప్రతి రోజూ ఉపయోగించే వస్తువులను సరిగ్గా వినియోగించకపోతే అవి చాలా ప్రమాదకరంగా మారవచ్చు అని మీరు గ్రహిస్తారు. మీ పసిపిల్లలు తమకు తాము గాయపరచుకున్నంత సులభంగా మీ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురి కావచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంట్లో వంట చేయడం మానేసి, వీటన్నింటిని వదిలించుకుంటారా? ఖచ్చితంగా, కాదు! మీరు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. మీ జీవితంలోని అన్ని విషయాలలో మీరు చేయవలసినది అదే.

జీవితం అనిశ్చిత పరిస్థితులతో నిండి ఉంటుంది కానీ అది మీరు కోరుకునే విధంగా జీవించకుండా మిమ్మల్ని ఆపకూడదు. మీ జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి మీకు హక్కు ఉంది. రిస్కుల విషయానికొస్తే, మీరు తీసుకోగల ముందు జాగ్రత్త చర్యలు ఉన్నాయి మరియు ఇన్సూరెన్స్ పొందడం వాటిలో ఒకటి.

మిమ్మల్ని మరియు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కవర్ చేయడం నుండి ఇల్లు మరియు మోటారు వాహనం వంటి మీ విలువైన ఆస్తులను కవర్ చేయడం వరకు, మీ జీవితంలోని మీకు అత్యవసరమైన అన్ని అంశాలకు ఆర్థిక రక్షణ కలిపించుకోవచ్చు.

అయితే, ప్రీమియం లెక్కింపులో ఉన్న సంక్లిష్టత కారణంగా మీరు ఈ ముఖ్యమైన పనిని ఎక్కువ కాలం నిలిపి ఉంచినట్లయితే, మీరు ఆన్‌లైన్‌లో మా జనరల్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను యాక్సెస్ చేసి ఈ పనిని సులభంగా పూర్తి చేయవచ్చు.

కొన్ని ప్రాథమిక వివరాలు మరియు కొన్ని సెకన్లలో మా క్యాలిక్యులేటర్ మీకు ఇల్లు మరియు ఆరోగ్యం నుండి కారు మరియు ప్రయాణం వరకు అన్నింటికీ ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ కోసం కోట్ పై తక్షణ ప్రీమియం అందిస్తుంది. 

 

 

 

 

మీ గణిత పరీక్షల సమయంలో మీరు చివరికి ఒక క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించగలిగినప్పుడు ఆల్‌జీబ్రా సమీకరణాలను ఎలా సులభంగా పరిష్కరించారో మీకు గుర్తుందా? అయితే, ఆన్‌లైన్‌లో మా జనరల్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌తో, లెక్కింపు చాలా సులభం!

ఉదాహరణకు, మీరు ఒక విదేశీ అంతర్జాతీయ గమ్యస్థానంలో మీ తదుపరి ప్రయాణ సాహసయాత్రను నిర్ణయిస్తుండవచ్చు మరియు ఇందులో ఉన్న ప్రమాదాల కారణంగా, మీరు ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని పొందాలి కానీ మీకు కలిగే ప్రశ్న, 'దానికి ఎంత ఖర్చు అవుతుంది?’

సాధారణంగా, మీరు ఇన్సూరెన్స్ ఆఫీసుకి వెళ్లాలి, ఒక అనుభవజ్ఞులైన ప్రయాణీకుడైన స్నేహితుడికి కాల్ చేయాలి లేదా మీ స్వంతంగా ఇంటర్నెట్‌లో విస్తృతమైన పరిశోధన చేయాలి, కానీ మా జనరల్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌తో, మీరు ఈ ప్రశ్నను 10 సెకన్లలో పరిష్కరించుకుంటారు.

అవసరం, బడ్జెట్, వయస్సు మరియు ఇతర వేరియబుల్స్ ఆధారంగా వేగవంతమైన, అవాంతరాలు-లేని పద్ధతిలో మరియు నిరంతరాయంగా మీ పాలసీ ప్రీమియంను లెక్కించడంలో మా ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్లు మీకు సహాయపడతాయి.

ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ల కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

తెలివైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది

సమాచారమే శక్తి అని అందరికీ తెలుసు మరియు మీ పాలసీకి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు మీరు అన్ని చోట్ల ఎందుకు పరిగెత్తాలి? మా జనరల్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్లతో, అన్ని ఎంపికలకు యాక్సెస్‌ను పొందుతూ, వాటిలో ప్రతిదానికి ప్రీమియంను లెక్కించేటప్పుడు మీరు మీ ఇంట్లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

కాబట్టి, మీకు ఇష్టమైన ప్రదేశంలో ఆహ్లాదకరంగా టీ తాగుతూ మీకు ఏ ఇన్సూరెన్స్ పాలసీ ఉత్తమమైనది అని మీరు నిర్ణయించుకోవచ్చు.

మీరు సిద్ధంగా ఉండటానికి సహాయపడుతుంది

ఊహించని ఖర్చులు రావాలని ఎవరూ కోరుకోరు. అయినప్పటికీ, మీరు బడ్జెట్ కోసం ఎంత సమయం వెచ్చించినా అవి రాకుండా ఉండవు. ఊహించని ఖర్చుల కోసం డబ్బును పక్కన ఉంచడం వివేకవంతమైన ఆలోచన అయితే, అవకాశం ఉన్న అన్ని రకాల ఖర్చులను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఆన్‌లైన్‌లో మా జనరల్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ల సహాయంతో, మీరు కొన్ని సెకన్లలోనే మీ, మీ కుటుంబ వైద్య ఖర్చులు, కారు, ఇల్లు మరియు మరిన్నిటిని కవర్ చేసే ఖర్చును లెక్కించవచ్చు. ఇది మీ వ్యక్తిగత ఫైనాన్సులను మెరుగ్గా నిర్వహించడంలో, మరింత సిద్ధంగా ఉండడంలో మీకు సహాయపడుతుంది.

టైం సేవింగ్

మీరు ఒక బిజీ జీవితాన్ని గడుపుతున్నారని మరియు రోజంతా మీరు చేయటానికి అనేక పనులు ఉన్నాయని మాకు తెలుసు. ఇన్సూరెన్స్ సంబంధిత విషయాల కారణంగా మీరు చేయవలసిన మీ పనులకు మరొక పనిని ఎందుకు జోడించాలి?

మేము మీకు అన్ని ఇన్సూరెన్స్ సంబంధిత సమాచారం మరియు సహాయాన్ని ఆన్‌లైన్‌లో అందించడమే కాకుండా, మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తాము. బ్రేక్‌ఫాస్ట్ తింటున్నప్పుడైనా లేదా వర్క్ చేస్తున్నప్పుడు, మీ ప్రీమియం అంచనాను కనుగొనడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. 

 

 

 

 

మీరు మాకు చాలా ప్రత్యేకం! ‌,ఇన్సూరెన్స్ ప్రీమియం మీకు భారం కాకుండా ఉండేలాగా నిర్ధారించడానికి మేము ఉత్తమంగా ప్రయత్నిస్తాము. మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయించేటప్పుడు మేము అనేక విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఇదే కారణం.

వివిధ ఇన్సూరెన్స్ పాలసీల కోసం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, క్రింద కొన్ని సాధారణ నిర్ణాయకాలు ఇవ్వబడ్డాయి:

వయస్సు

సాధారణంగా వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే, కానీ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చినప్పుడు, మీరు ఎంత తొందరగా దానిని తీసుకుంటారో, అంత సరసమైనదిగా ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఇది వాస్తవం.

మోటార్ ఇన్సూరెన్స్ కోసం, కారు పాతది అయితే, ప్రీమియం తగ్గుతుంది. ఎందుకంటే మీ వాహనం వయస్సు పెరిగే కొద్దీ మీ వాహనం ఐడివి తగ్గుతుంది, దీని వలన ప్రీమియం తగ్గుతుంది.

ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం

మీరు ఎంచుకున్న దానిలో మీ బడ్జెట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని మేము అర్థం చేసుకున్నందున మీ కోసం మీకు కావలసిన కవర్ మొత్తాన్ని ఎంచుకోవడానికి మేము మీకు సౌలభ్యాన్ని అందిస్తున్నాము.

అందువల్ల, మీ అవసరం, వయస్సు లేదా లింగంతో సంబంధం లేకుండా, మా వద్ద ఒక పాలసీ ఉంది, దాని ప్రీమియం మీ ప్రాధాన్యతల ప్రకారం ఉండడమే కాకుండా మీ బడ్జెట్‌కు తగినట్లుగా ఉంటుంది. అయితే, మీరు ఎంచుకున్న ఇన్సూర్ చేయబడిన మొత్తం ఆధారంగా ప్రీమియం మొత్తం భిన్నంగా ఉంటుంది.

వ్యక్తి లేదా గ్రూప్

ప్రత్యేకంగా హెల్త్ లేదా ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకోబడే అంశాల్లో ఒకటి ఏమిటంటే అది ఒక వ్యక్తి కోసం లేదా ఒక గ్రూప్ కోసం తీసుకోవలసి ఉంటుందా అని.

మీరు ఒక గ్రూప్‌ కోసం కవర్‌ని పొందడం కంటే మీ కోసం కవర్‌ని కొనుగోలు చేయడానికి మీరు చెల్లించవలసిన ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తంలో తేడా ఉంటుంది.

ఇది కాకుండా, మీరు కవర్ చేయాలనుకుంటున్న ఆస్తి రకాన్ని బట్టి, అంశాలు తదనుగుణంగా మారుతాయి.

 

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం